శ్రీను గాడి కవితలు వీక్షించడానికి విచ్చేసిన అతిధులకు స్వాగతం...సుస్వాగతం.....
సంక్రాంతి శుభాకాంక్షల తో-మీ శ్రీను

వేలెంటైన్స్ డే సుభాకాంక్షలు తో .......మీ శ్రీనుగాడు:)




ప్రేమ తరాలు మారినా,యుగలు మారినా ఎటువంటి మార్పు చెందని ఓ అందమైన - మధురమైన కావ్యం,భావం, బంధం.అటువంటి ప్రేమను తెలిపేదే ఈ ప్రేమికుల రోజు ఈ ప్రేమను ఈ ప్రేమికులరోజు మీ ప్రేయసి/ప్రియుడు కు ఎలా తెలుపాలి?ఇది చాలా మంది ప్రేమికుల మదిని తొలిచే ఓ ప్రశ్న,ఈ రోజు అంటే ప్రేమికుల రోజు న(Feb 14)ఈ ప్రశ్నకు సమాధానం చాలా మంది చాలా రకాలుగా చెపుతారు.ఓ ప్రేమికుడు తన ప్రియురాలికి ఇస్టమైన ఓ అందమైన గులాబి తో చెపితే,మరో ప్రేమికుడు తన ప్రేయసికి ఇస్టమైన ఓ అందమైన రింగ్/మరో ఏదయినా బహుమతిగా ఇచ్చి చెపుతాడు.ఈ విదంగా వారి ప్రేమను అనేక విధములుగా వ్యక్త పరిచుకునే రోజే ఈ ప్రేమికులరొజు.ప్రతి మనిషి తన జీవితం లో ఏదొ ఒకరొజు ఏదొ ఒక సంధర్బం లో ప్రేమిస్తారు లేదా ప్రేమించబడతారు.అలా ప్రేమించే మనసుగాని ప్రేమను పంచే మనస్సు గాని లేనప్పుడు మనకు ఈ ప్రపంచం తో పని ఏమయినా వుంటుందా?ఖచ్చితం గా వుండదు..ఒక్కసారి అయినా ఈ ప్రపంచాన్ని ప్రేమ లేకుండా ఉహిచగలమేమొ ప్రయత్నించండి..ఉహించలేకపోతున్నం కదా!అవును మరి ఉహించడానికే కష్టం గా వున్నప్పుడు ప్రేమ లేకుండా ప్రపంచం దానిలో మనం ఎలా వుండగలం?సొ.....ఈ ప్రేమికుల రోజు మీ ప్రేమను మీ ప్రియురాలు /ప్రియుడు అంగీకరించాలని కోరుకుంటూ...మీ శ్రీనుగాడు



మీ శ్రీనుగాడు రాసిన ఓ చిన్ని కవిత :-

ఓ ప్రేయసి తన ప్రియుడుకి తన ప్రేమను ఎలా తెలుపుతుందో మీరే చూడండి.....

ఓ ప్రియా..
నా లో నీ పై దాగిన ప్రేమ ఈ ప్రేమికులరోజు ఎలా?
తెలపను..?
నా మనసుని నీ మనసు తో హత్తుకుని
తెలుపనా...?
నా చూపుల తో నీ చుపులను బందించి
తెలుపనా ....?
నా లో దాగిన సిగ్గునంతా నా కొంగు చాటున బందించి
తెలుపనా.....?
ఓ అందమైన గులాబి లో నా ప్రేమనంతా నింపి
తెలుపనా......?
నా మనసునంతా నా గుప్పెట్లోకి తీసుకుని నీకు బహుమతి గా ఇచ్చి
తెలుపనా .......?
ఎలా తెలిపినా ....నా మనసు నిండా నువ్వే ఉన్నవురా,
బంగారం ....I love you soooooooooooomuch ra.
ఇట్లు,
ప్రేమతో,నీ ప్రేమలో బతికే..
నీ ....స్వీట్ హార్ట్.

No comments:

కాపీరైట్స్

© 2009. All rights reserved with http://www.srinukavitalu.blogspot.com/